ఆంధ్ర ప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కొడవలూరు గ్రామంలో ఓ వ్యక్తి తన భార్యను అతికిరాతకంగా హత్య చేశాడు. దారుణంగా గొంతుకోసి చంపేశాడు. భార్యపై అనుమానంతోనే ఈ ఉదంతానికి పాల్పడి ఉంటాడని స్థానికులు చెప్తున్నారు.
మండలంలోని ఎన్టీఆర్ కాలనీలో హరికృష్ణ, స్రవంతి నివాసముంటున్నారు. వీరు గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: వ్యక్తిని హత్య చేసి ముఖాన్ని పెట్రోల్ పోసి కాల్చేశారు.!