ఇవీ చూడండి:బాలికపై ఉన్మాదుల ఘాతుకం
చరిత్రలో నిలిచిన పరిశ్రమే అకృత్యానికి కేంద్రం
విశ్వనగరంగా చెప్పుకునే భాగ్యనగరంలో అకృత్యాలు పెరుగుతున్నాయి. చరిత్రలో ఎంతోమందికి ఉపాధి కల్పించి కాలక్రమంలో మూతపడ్డ డీబీఆర్ మిల్స్లాంటి పరిశ్రమలే... అరాచకాలకు అడ్డాగా మారుతున్నాయి.
నిర్మానుష్య ప్రదేశాలే అరాచకాలకు కేంద్ర బిందువులు
దాదాపు కోటి జనాభా ఉన్న మన విశ్వనగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై... బాలుడు బ్లేడ్‌తో అత్యంత పాశవికంగా దాడి చేశాడు. సెల్ఫోన్లో నగ్నంగా చిత్రీకరించి పైశాచికాన్ని చూపించాడు. మహిళా దినోత్సవం రోజే ఈ దుర్ఘటన జరిగింది. అన్నెం పున్నెం ఎరుగని ఆ బాలికకు గంజాయి అలవాటు చేసి ఈ దారుణానికి ఒడిగట్టారు. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం మూతపడ్డ డీబీఆర్ మిల్స్(లోయర్ ట్యాంక్ బండ్) కేంద్రంగా అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇలాంటి నిర్మానుష్య ప్రదేశాలే అరాచకాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. డీబీఆర్ మిల్స్ అక్రమాలకు అడ్డాగా ఎలా మారిందో... మా ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ వివరిస్తున్నారు.
ఇవీ చూడండి:బాలికపై ఉన్మాదుల ఘాతుకం
This is test file from feedroom
Last Updated : Mar 9, 2019, 12:19 PM IST