ETV Bharat / jagte-raho

'కిడ్నాప్' కలకలం: బాధితుడి వాదన ఒకటి.. పోలీసుల వాదన మరొకటి!

author img

By

Published : Nov 6, 2020, 5:44 PM IST

ఏపీలోని గుంటూరు మిర్చి యార్డులో శుక్రవారం కలకలం రేగింది. శేఖర్ రెడ్డి అనే వ్యాపారిని కొందరు అపహరించేందుకు యత్నించగా.. తోటి వ్యాపారులు, కూలీలు అడ్డుకున్నారు. మాచర్ల ఎమ్మెల్యే అనుచరులు తనను కిడ్నాప్ చేసేందుకు యత్నించారని బాధితుడు, అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయంపై.. పోలీసుల వాదన మరోలా ఉంది.

'కిడ్నాప్' కలకలం: బాధితుడి వాదన ఒకటి.. పోలీసుల వాదన మరోటి!

వ్యాపారులు, రైతులు, కూలీలతో నిత్యం సందడిగా ఉండే ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు మిర్చి యార్డులో శుక్రవారం హైడ్రామా జరిగింది. యార్డులో కమిషన్ వ్యాపారం నిర్వహించే శేఖర్ రెడ్డి అనే వ్యక్తిని కొందరు బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించటం కలకలం రేపింది. తోటి వ్యాపారులు, కూలీలు వారిని అడ్డుకున్నారు. మాచర్ల ఎమ్మెల్యే అనుచరుడు మేకల శ్రీనివాసరెడ్డే తనను కిడ్నాప్ చేసేందుకు యత్నించారని.. బాధితుడు శేఖర్​ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే అండతో శ్రీనివాసరెడ్డి తన భర్తను చంపేందుకు యత్నిస్తున్నారని శేఖర్ రెడ్డి భార్య హరిత ఆరోపించారు. గతంలో అతనిపై తాము లాలాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. 6 నెలలుగా తన భర్తను హతమార్చేందుకు కొందరు యత్నిస్తున్నారని చెప్పారు.

'కిడ్నాపర్లు కాదు.. పోలీసులే'

ఈ ఘటనపై పోలీసుల వాదన మరోలా ఉంది. ఇది కిడ్నాప్ వ్యవహారం కాదని నగరంపాలెం సీఐ మల్లికార్జున మీడియాకు తెలిపారు. వ్యాపారి శేఖర్ రెడ్డి పైన మేకల శ్రీనివాసరెడ్డి ఫిర్యాదుతో కారంపూడి పోలీసు స్టేషన్​లో కిడ్నాప్ కేసు నమోదైందని వెల్లడించారు. ఆ కేసులో శేఖర్ రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు మిర్చి యార్డుకు వచ్చారని.. మఫ్టీలో ఉండటం వల్ల వ్యాపారులు, కూలీలు వారిని అడ్డుకున్నట్లు చెబుతున్నారు. అయితే పోలీసుల వాదనను బాధితుడు శేఖర్ రెడ్డి తోసిపుచ్చారు. తనపైన కారంపూడిలో కిడ్నాప్ కేసు ఉందంటున్న పోలీసులు.. ఎవరిని కిడ్నాప్ చేశానో మాత్రం చెప్పటం లేదన్నారు.

అసలు కారణం ఇదేనా?

రూపా ట్రేడర్స్ పేరిట శేఖర్ రెడ్డి, అతని మేనమామ, మేకల శ్రీనివాసరెడ్డి వ్యాపారం చేసేవారు. శేఖర్ రెడ్డి మేనమామ నాలుగేళ్ల క్రితం ఐపీ పెట్టి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అప్పులు శేఖర్ రెడ్డి తీరుస్తున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవలే శేఖర్ రెడ్డి మేనమామ తిరిగి వచ్చాడని.. అప్పులు ఎగ్గొట్టేందుకు మేకల శ్రీనివాసరెడ్డితో కలిసి కుట్ర పన్నారని చెబుతున్నారు. మరోవైపు ఇప్పుడు వివాదానికి కారణమైన మేకల శ్రీనివాసరెడ్డి కూడా శేఖర్ రెడ్డికి బంధువే. ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన విభేదాలే ఇలా గొడవలు, కిడ్నాప్ యత్నాలు, కేసుల వరకూ తీసుకెళ్లాయని బాధితుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: ఏపీ: కడప పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.