ETV Bharat / jagte-raho

ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌.. కేరాఫ్​ మందుబాబుల అడ్డా

అదో చారిత్రక ప్రదేశం. రాజధాని నడిబోడ్డులోని ప్రముఖ ప్రాంతం. చుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు, చుట్టూ నిత్యం గస్తీ ఉండే సిబ్బంది. కానీ ఇప్పుడది మందుబాబులకు అడ్డాగా మారింది. లాక్​డౌన్ సడలింపుల్లో భాగంగా మద్యం దుకాణాలు తెరుచున్నప్పటి నుంచి.. మంచి సిట్టింగ్​ స్పాట్​గా మందుబాబుల ఎంపికలో తొలిస్థానంలో ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో దోస్తులతో కలిసి వచ్చి.. సాయంత్రం వరకు మద్యం సేవించి ఖుషీ అవుతున్నారు. ఇంతకీ ఆ ప్రాంతం పర్మిట్​ రూమ్ ఎలా అయ్యింది?

author img

By

Published : Jun 10, 2020, 6:27 AM IST

ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌.. కేరాఫ్​ మందుబాబుల అడ్డా
ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌.. కేరాఫ్​ మందుబాబుల అడ్డా

కరోనా తెచ్చిన లాక్​డౌన్​ మందుబాబులకు మేలే చేసింది. స్నేహితులంతా గుమిగూడి నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకుని మందు తాగే అడ్డాలుగా మార్చుకుంటున్నారు. నిర్మానుష్యంగా ఏ ప్రాంతం కనిపించినా అక్కడే తిష్ఠ వేసి రోజూ మద్యం సేవిస్తున్నారు. పర్మిట్‌ రూమ్‌లు అందుబాటులో లేనందున ఖాళీ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. చారిత్రక ప్రదేశమైన ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ ఇప్పుడు మందు బాబులకు అడ్డాగా మారిపోయింది. చుట్టు పక్కల ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా ఏ మాత్రం జంకు లేకుండా సిట్టింగ్‌ వేస్తున్నారు. సెక్యూరిటీ లేకపోవడం, ఎవరూ పట్టించుకోనందున వీరి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.

సెక్యూరిటీ ఉన్నా ఎలా?

ఈటీవీ భారత్​ క్షేత్రస్థాయిలో పరిశీలించగా గుట్టల కొద్దీ ఖరీదైన మద్యం బాటిళ్లు, బీరు సీసాలు అక్కడ కనిపిస్తున్నాయి. ప్యాలెస్‌ చుట్టు పక్కల ఎక్కడ చూసినా మద్యం సీసాలే దర్శనమిస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మందుబాబులంతా అక్కడే మద్యం సేవిస్తూ రాత్రి వరకు గడుపుతున్నారు. సెక్యూరిటీ సిబ్బందిని నియమించినా అక్కడి వరకు వెళ్లి మద్యం ఎలా సేవిస్తున్నారన్నదే అసలు ప్రశ్న.

నేరాలకు ఆస్కారం..

ప్యాలెస్​ పరిసర ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంటుంది కాబట్టి నేరాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. వీరి ద్వారా పక్కనే ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ముప్పు వాటిల్లే అస్కారం ఉంది. మద్యం దుకాణాలు తెరుచుకున్నప్పటి నుంచి రోజూ యువకులు వచ్చి మద్యం సేవిస్తుంటారని ప్రత్యక్షంగా గమనించినవారు చెబుతున్నారు.

ఇవీ చూడండి: వరుణుడి బీభత్సం... తొమ్మిది మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.