ETV Bharat / jagte-raho

మాటలు రాని మౌనం... మనసు చెదిరి మరణం - nizamabad news

పుట్టుకతోనే మూగ, చెవుడు సమస్యలున్న ఆ దివ్యాంగుల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. వారి పెళ్లికి మాత్రం పెద్దలు అంగీకరించలేదు. కలత చెందిన వారు.. నల్గొండ జిల్లా అనుముల మండలం పాలెం గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు.

మాటలు రాని మౌనం... మనసు చెదిరి మరణం
మాటలు రాని మౌనం... మనసు చెదిరి మరణం
author img

By

Published : Sep 11, 2020, 7:21 AM IST

నిజామాబాదు జిల్లా ఎడవల్లి మండలం జక్కంపేట గ్రామానికి చెందిన నందిపాటి అశ్విని (20), గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుపేటకు చెందిన షేక్‌ మస్తాన్‌వలీ (27) హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అమెజాన్‌ సంస్థలో పనిచేస్తున్నారు. అక్కడ వీరిమధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసుకోవాలనుకున్నా.. మస్తాన్‌వలీకి ఇదివరకే మరో దివ్యాంగురాలితో వివాహం జరగడంతో అశ్విని తల్లి నిరాకరించింది.

మాటలు రాని మౌనం... మనసు చెదిరి మరణం

ఈనెల 7న హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారిద్దరూ గురువారం తెల్లవారుజామున పాలెం శివారులో పెట్రోల్‌తో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు హాలియా సీఐ వీరరాఘవులు, ఎస్‌ఐ శివకుమార్‌ అక్కడికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేశారు. గుర్తింపు కార్డుల ఆధారంగా మృతుల బంధువులకు సమాచారం అందించారు. ఘటన జరగటానికి గంట ముందు అశ్విని తాము చనిపోతున్నట్లు సైగలతో సూచిస్తూ... వీడియో తీసి స్నేహితులకు సందేశం పంపారు.

వీడియోకు స్పందించిన స్నేహితులు... చనిపోవద్దని, ఎక్కడ ఉన్నారో తెలపాలని కోరారు. అయినా అశ్విని స్పందించలేదని.. వీరి మరణవార్త తెలిసిన తర్వాత హాలియాకు వచ్చిన స్నేహితులు తెలిపారు.

ఇదీ చూడండి: పాలెం శివారులో ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.