హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో నిషేధిత గుట్కా అక్రమ రవాణా చేస్తూ.. విక్రయిస్తున్న ఓముఠా గుట్టురట్టయింది. ఉప్పల్‌లో ఓ కిరాణా దుకాణంలో నిల్వ ఉంచిన 13 లక్షల విలువైన గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కొన్నిరోజుల కిందట వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు ఉప్పల్ నుంచి వరంగల్‌కి తరలిస్తున్న 14 వేల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొన్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారిచ్చిన సమాచారంతో కొందరిపై నిఘా ఉంచారు.
పక్కా సమాచారంతో
విశ్వసనీయ సమాచారంతో ఉప్పల్ ప్రాంతంలోని కిరాణా దుకాణంపై దాడిచేసి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. యజమాని చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత గుట్కా విక్రయించినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అవసరమైతే పీడీయాక్ట్ ప్రయోగిస్తామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:"అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు"