ఉపాధి కోసం ఇరాక్ వెళ్లి ఏజెంట్ మోసంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమని స్వదేశానికి తీసుకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని గల్ఫ్ బాధితులు వేడుకుంటున్నారు. బతుకుదెరువు కోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతో పాటు ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన సుమారు 32 మంది యువకులు ఇరాక్‌కు వెళ్లారని రాష్ట్ర గల్ఫ్ సంక్షేమ అధ్యక్షుడు బసంత్ రెడ్డి తెలిపారు. ఏజెంట్ మోసం చేసి... ఉపాధి చూపించకుండా సరిహద్దు ప్రాంతమైన తీవ్రవాదులు ఉండే కిర్గ్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కంపెనీకి అమ్మేశారని వాపోయారు.
ఆ కంపెనీ వారు కూలీల పాస్‌పోర్ట్‌లు స్వాధీనం చేసుకొని చిత్రహింసలకు గురిచేయడంతో పాటు తిండి కూడా పెట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాక్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసులను తిరిగి స్వదేశానికి పంపించేలా ఏర్పాట్లు చేయాలని వీడియో సందేశం ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి: సలబాత్పూర్ వద్ద నల్లబెల్లం పట్టివేత