వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన రవలికి, భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్కు చెందిన రాజుతో 16 రోజుల క్రితం పెళ్లి జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేశారంటూ సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
తన చావుకు ఎవరు కారణం కాదని... పెళ్లికి కులం, మతం చూడవద్దని తల్లిదండ్రులకు సూచించింది. క్షమించమని భర్తను కోరింది. పెళ్లై పక్షం రోజులు కాకముందే తమ కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: తాగి వేధిస్తున్న భర్తకు నడిరోడ్డుపై దేహశుద్ధి