నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చింతలగూడెం పరిధిలోని కుక్కడంలో ప్రేమ వివాహం కొట్లాటకు దారి తీసింది. యువతి తల్లిదండ్రులు యువకుడి తల్లిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చికిత్స కోసం మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మాడ్గులపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చింతగూడెం గ్రామానికి చెందిన చింతకుంట్ల సైదిరెడ్డి కూతురు ప్రణీత... వాళ్లింటికి ఎదురుగా ఉండే ఉపేందర్ రెడ్డి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం లేక హైదరాబాద్ వెళ్లి ఈ నెల 11న ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న ప్రణీత తల్లిదండ్రులు శుక్రవారం సాయంత్రం ఉపేందర్ రెడ్డి తల్లిపై కర్రలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె రెండు చేతులు విరిగాయి.