ETV Bharat / jagte-raho

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం - నిందితుడిని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు

హైదరాబాద్ లో ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై ఇదివరకే వరంగల్ లో ఓ కేసు నమోదైంది.

ప్రభుత్వ ఉద్యోగాలంటూ మోసం
ప్రభుత్వ ఉద్యోగాలంటూ మోసం
author img

By

Published : Aug 31, 2020, 8:30 PM IST

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ... మోసాలకు పాల్పడుతున్న ఓ మోసగాడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. బాచుపల్లిలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్న రవీందర్ ను ఏడాది కిందట పరిచయం చేసుకున్న నిందితుడు ఫైజాన్... తనకు ప్రభుత్వాధికారులు, మంత్రులతో సంబంధాలున్నాయని నమ్మించాడు. రవాణా శాఖలో ఏఎంవీఐలుగా ఉద్యోగాలు ఇప్పిస్తానన్న ఫైజాన్ మాటలు నమ్మి తన కుమారుడికి ఇప్పించాలని కోరారు.

కొలువులు ఇప్పించాలని కోరుతూ... రవీందర్ కుమారుడు, అతడి స్నేహితులు కలిసి కొద్దినెలల క్రితం రూ. 84 లక్షలు ఫైజాన్ కు ఇచ్చారు. కొద్ది రోజులకు నకిలీ నియామక పత్రాలను ఇచ్చి మౌఖిక పరీక్షలకు వెళ్లండంటూ సూచించారు. తనకు విదేశాల్లో వ్యాపారాలున్నాయని... బ్యాంకాక్ రెస్టారెంట్ ప్రారంభిద్దామంటూ రవీందర్​కు చెప్పి రూ. 50లక్షలు తీసుకున్నాడు. నియామక పత్రాలతో రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లిన యువకులకు నకిలీవని అధికారుల స్పష్టం చేశారు.

మోసపోయామని గ్రహించిన వారు ఫైజాన్ ను కలిసేందుకు గచ్చిబౌలిలోని అతని నివాసానికి వెళ్లగా అప్పటికే పరారయ్యాడు. రూ. 1.34 కోట్లు కొల్లగొట్టాడంటూ బాధితులు సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. నిందితుడు పదోతరగతి తప్పి చిన్న, చిన్న పనులు చేసుకుంటూ స్థిరాస్తి వ్యాపారిగా మారాడు. ఉద్యోగాలిప్పిస్తానని మోసగించి భారీగా సంపాదించువచ్చని భావించి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాడు. నిందితుడిపై వరంగల్ లోనూ ఓ కేసు నమోదైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.