గొర్రెకుంట బావి మృతదేహాల మిస్టరీ వీడింది. 9 మంది మరణానికి బిహార్‌కు చెందిన సంజయ్ కుమార్ యాదవే కారణమని... పోలీసుల విచారణలో వెల్లడైంది. కూల్ డ్రింకులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి.. మక్సూద్ కుటుంబసభ్యులు అపస్మారక స్థితిలోకి వెళ్లాక... బావిలోకి తోసేసి హత్యచేసినట్లు సంజయ్ పోలీసుల వద్ద నేరం అంగీకరించినట్లు తెలుస్తోంది. నిందితుడిని సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
సంబంధిత కథనాలు: ఆ బావిలో తొమ్మిది మృతదేహాలు..
ప్రేమ వ్యవహారమే కారణమా?
మక్ సూద్ కుమార్తెతో ఉన్న ప్రేమ వ్యవహారం... ఇతరులతో ఆమె సన్నిహితంగా ఉంటోందన్న కసితో సంజయ్ ఈ హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. మక్ సూద్ కుమారుడి పుట్టిన రోజు వేడుకలకు వచ్చి... శీతలపానీయాల్లో నిద్రమాత్రలిచ్చి స్పృహ కోల్పోయిన తరువాత ఒక్కొక్కరిగా బావిలో పడేసి హత్యచేసినట్లు విచారణలో తేలింది.
సంబంధిత కథనాలు: బావి ఘటనలో దర్యాప్తు ఇలా సాగింది..
20 ఏళ్ల క్రితం వరంగల్‌కు
పశ్చిమ్ బంగాకు చెందిన మక్ సూద్ 20 ఏళ్ల క్రితమే వరంగల్‌కు వచ్చి స్థిరపడ్డాడు. గత ఏడాది డిసెంబర్లో గొర్రకుంటలోని ఓ గోదాంలో... గన్నీ సంచులు కుట్టే పనిలో చేరాడు. నగరంలోని కరీమాబాద్‌లో నివాసముంటున్న మక్ సూద్... లాక్ డౌన్ కారణంగా తాను పనిచేసే గోదాం వద్దకే మకాం మార్చాడు. వీరుండే పక్క గదిలోనే ఇద్దరు బిహార్ యువకులు కూడా ఉంటున్నారు.
సంబంధిత కథనాలు: నువ్వైనా చెప్పవే! ఎలా జరిగిందో... ఎవరు చేశారో..?
మొదట నాలుగు... తర్వాత ఐదు
గురువారం సాయంత్రం... గోదాం సమీపంలోని పాడుబడిన బావిలో మక్ సూద్ అతని కుటుంబసభ్యుల నాలుగు మృతదేహాలు వెలుగుచూశాయి. మరునాడు ఇదే బావిలో 5 మృతదేహాలు కనిపించాయి. మక్ సూద్... అతని భార్య నిషా, కొడుకు సొహెల్, షాబాజ్, కుమార్త బుస్రా... మనమడితో పాటు ఇద్దరు బిహార్ యువకులు, మక్ సూద్‌కు బాగా పరిచయం ఉన్న షకీల్ మృతదేహాలు కనిపించాయి. ఒక్కసారిగా 9 మంది చనిపోవడం తీవ్ర కలకలం రేపింది.
సంబంధిత కథనాలు: ఆపరేషన్ బావి
ఓ ఆటో వాలా కూడా
పోలీసులు గత మూడు రోజలుగా ముమ్మర దర్యాప్తు చేశారు. పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదికలో కూడా.. నీళ్లలో పడి చనిపోయారని స్పష్టంగా ఉంది. చివరకు ఫోన్ కాల్ డేటా ఆధారంగా... సంజయ్ యాదవ్, మోహన్‌తోపాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించారు. ఓ ఆటో వాలా కూడా సంజయ్‌కు సహకరించినట్లు సమాచారం.
సంబంధిత కథనాలు: బావిలో లభ్యమైన మృతదేహాలకు శవపరీక్ష పూర్తి