మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీనుగురాలకు చెందిన చిట్టెమ్మకు ఒక్కగానొక్క కూతురు స్వాతి. తల్లి కూలి పని చేస్తూ... స్వాతి పార్ట్ టైం పని చేసుకుంటూనే దేవరకద్రలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. డిగ్రీ చేసేందుకు సన్నద్ధం అవుతున్న తరుణంలో విధి వక్రీకరించి పాముకాటుతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నిండాయి.
![girl died with snake bite in ginugurala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-mbnr-01-10-sneak-bite-yuvathi-mruthi-avts10094_10092020093008_1009f_1599710408_325.jpg)
ఆరుబయట నిద్రిస్తుండగా... అర్ధరాత్రి పూట ఓ కట్ల పాము స్వాతిని కాటు వేసింది. వెంటనే గుర్తించిన తల్లి... పామును చంపేసింది. బంధువులతో కలిసి స్వాతిని దేవరకద్ర ఆస్పత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స అందించింది. మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటం వల్ల హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూనే స్వాతి ప్రాణాలు వదిలింది. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న కూతురు విగతజీవిగా మారటాన్ని చూసి తల్లి రోదనలు మిన్నంటాయి.