మేడ్చల్ జిల్లా నేరెడ్‌మెట్‌లో 12 ఏళ్ల బాలిక అదృశ్యం ఘటన విషాదంగా ముగిసింది. నిన్న సాయంత్రం అదృశ్యమైన బాలిక... నాలాలో విగతజీవిగా బయటపడింది. కాకతీయనగర్‌కు చెందిన ఐదో తరగతి చదువుతున్న 12 ఏళ్ల సుమేధ కపురియా.. నిన్న సాయంత్రం అదృశ్యమైంది. సైకిల్‌పై బయటికి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.
సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించగా సైకిల్‌పై వెళ్తున్నట్లు గుర్తించారు. జీహెచ్ఎంసీ బృందాల గాలింపు చర్యల్లో... నాలాలో సైకిల్ దొరికింది. భారీ వర్షానికి దీన్ దయాల్ నగర్ నాలా పొంగిపొర్లడంతో బాలిక ప్రమాదవశాత్తు పడిపోవచ్చని అనుమానంతో నాలాలో సెర్చ్ ఆపరేషన్స్ చేపట్టారు. రెస్క్యూ బృందాల గాలింపులో బండ చెరువు వద్ద నాలాలో బాలిక మృతదేహం బయటపడింది.