యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆడ శిశువును విక్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. భువనగిరి ఆస్పత్రిలో ఈనెల 12న ఓ యువతి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఈనెల 14న రూ.60 వేలకు యువతి తల్లి విక్రయించింది.
ఘట్‌కేసర్‌కు చెందిన పిల్లలు లేని దంపతులు ఆ శిశువును కొనుగోలు చేశారు. యాదాద్రి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దంపతుల నుంచి ఆడ శిశువును స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి : 'ఉపాధి హామీ పనుల కోసం ఫోన్ చేయండి'