వ్యాపారంలో నష్టాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మారేడ్పల్లి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఒక్కసారిగా వ్యాపారంలో వచ్చిన నష్టాలతో మనస్థాపం చెంది... వెంకటేశ్ గుప్తా అనే పండ్ల వ్యాపార గోదాంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వెంకటేశ్ గుప్తా... సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో తోపుడు బండ్లపై పండ్ల వ్యాపారం నిర్వహించేవాడు. చిట్టీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసేవాడు. గతేడాది కుమార్తె వివాహం ఘనంగా జరిపించాడు. ఆ అప్పుల్లోంచి తేరుకునేలోపు... లాక్డౌన్తో వ్యాపారంలో నష్టపోయాడు. ఏం చేయాలో తెలియక గోదాంలో ఉరివేసుకొని చనిపోయాడు. కుమారుడు శ్రవణ్ వచ్చి చూడగా... శవమై కనిపించాడు. ఎంతో మంది పేదవారికి సాయం చేసేవాడని పేరున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కిల్లర్ అల్లుడు.. ఆస్తి కోసం అత్తమామలను లేపేశాడు..