ETV Bharat / jagte-raho

రొంపిచర్ల ప్రమాదం: పొట్టకూటి కోసం వెళ్తే... కబళించిన మృత్యువు - Rompicharla road accident latest news

కుటుంబానికి మూడుపుటల కడుపునింపేందుకు ప్రయాణమయ్యారు. అదే వారి జీవితానికి ఆఖరు ప్రయాణమని తెలుసుకోలేకపోయారు. రహదారులపై మృత్యువు దారి కాచి ఉందని గమనించలేకపోయారు. వారి ప్రాణాలను కబళిస్తోందని అనుకోలేదు. ఏపీలోని రొంపిచర్ల దగ్గర జరిగిన ప్రమాదంలో మృతి చెందిన తెలంగాణ వాసుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.

rompicharla accident latest news
రొంపిచర్ల ప్రమాదం: పొట్టకూటి కోసం వెళ్తే... కబళించిన మృత్యువు
author img

By

Published : Oct 16, 2020, 1:48 PM IST

పొట్టకూటి కోసం పనికి వెళ్తే.. మృత్యువు కబళించేసింది. వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. అసలు ఏం జరిగిందంటే..?

ఆంధ్రప్రదేశ్​ ప్రకాశం జిల్లాకు చెందిన మాధవ్​... తాను కొత్తగా కట్టుకున్న ఇంటికి రంగులు వేయడం కోసం, ఫర్నిచర్​ పని చేయించడం కోసం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలానికి చెందిన నలుగురిని కారులో గురువారం రాత్రి తీసుకెళ్లాడు. అదే వారి జీవితాలకు చివరి ప్రయాణం అవుతుందని తెలుసుకోలేకపోయారు.

ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్తున్న కారు... రొంపిచర్ల మండలం సుబ్బాయపాలెం వద్దకు చేరుకోగానే అదుపుతప్పి కాల్వలోకి బోల్తాకొట్టింది. పనికోసం వెళ్లిన నలుగురు వ్యక్తులు నీట మునిగి మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లాకు చెందిన మాధవ్​కు మాత్రం తీవ్రగాయాలతో బయటపడ్డాడు.

మృతుల వివరాలు...

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నంకు చెందిన పాలోజ్ ఆనంద్, ధర్మపురికి చెందిన ఆయన బావమర్ధి కటకం మహేష్, మరో వ్యక్తి జగదీశ్​ గౌడ్, ఆయన పది సంవత్సరాల కుమారుడు శివమ్ మృతి చెందారు. ప్రమాదంలో బావబామ్మర్దులు, తండ్రి కుమారుడు మరణించడంతో ధర్మపురిలో విషాదం నెలకొంది.

ఇదీ చదవండి: కారుబోల్తా పడి నలుగురు దుర్మరణం.. మృతుల్లో తెలంగాణవాసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.