ETV Bharat / jagte-raho

గంజాయి సరఫరా చేస్తున్న నలుగురి అరెస్ట్​ - police arrested four Accused for supplying Marijuana

హైదరాబాద్‌ నగరంలో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురిని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్​ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 21 కిలోల గంజాయి, 2 మోటార్‌ సైకిళ్లు, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్​ సహాయ సూపరింటెండెంట్ అంజిరెడ్డి తెలిపారు.

Four arrested for supplying Marijuana
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురి అరెస్ట్​
author img

By

Published : Oct 4, 2020, 8:13 PM IST

హైదరాబాద్​ తిలక్​నగర్‌లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్​ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై గంజాయి విక్రయిస్తున్న తిలక్​నగర్‌కు చెందిన కౌశల్య మనోజ్​సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 1.2 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని విచారించగా.. సృజన్‌ కుమార్‌ అనే వ్యక్తి సరఫరా చేసినట్లు తెలిపాడు. అనంతరం అధికారులు విద్యానగర్‌లోని సృజన్​ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. రెండు కిలోల ప్యాకెట్లు పదింటిని స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్​ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి వద్ద కిలో రూ.1500లకు కొనుగోలు చేసి.. హైదరాబాద్‌లో కిలో రూ.2500లకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చిందని అంజిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మనోజ్​సింగ్‌, అతని సోదరి గాయత్రి, దుర్గేష్‌, లకన్​సింగ్‌లను అరెస్టు చేసినట్లు వివరించారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును కాచిగూడ ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: కుర్నవల్లిలో 100 క్వింటాళ్ల అక్రమ రేషన్​బియ్యం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.