ఏళ్లుగా ఉన్న ఓ చెట్టు కొమ్మలను అనుమతి లేకుండా నరికినందుకు అటవీ అధికారులు ఓ ఇంటి యజమానికి జరిమానా విధించారు. వనస్థలిపురం డివిజన్ పరిధిలోని హిల్‌కాలనీ గురుద్వారా రోడ్ వద్ద నివాసం ఉండే నరసింహారెడ్డి.. తన ఇంటి ముందున్న చెట్టు కొమ్మలు నరికేశాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు వనస్థలిపురం అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
అనుమతి లేకుండా చెట్టు కొమ్మలు నరికినట్లు నిర్ధారించి.. నరసింహారెడ్డికి రూ. 8 వేలు జరిమానా విధించారు. సుమారు 45 సంవత్సరాల నుంచి ఉన్న ఈ చెట్టును తీసేయడం కోసం కొందరు ప్రయత్నిస్తున్నారని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: ఆన్‌లైన్ రుణ వేధింపులపై పోలీసులను ఆశ్రయించిన మహిళ