హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని సాహితీ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోని నీటిలో మునిగి బాలుడు మృతి చెందాడు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి వర్షపునీరు వచ్చి చేరింది. అపార్ట్‌మెంట్‌లో యుగేందర్... భార్యా, పిల్లలతో నివాసముంటున్నాడు. ఉదయం యుగేందర్ కుమారుడు అజిత్ సాయి ఆడుకుంటు కిందకు వెళ్లి సెల్లార్‌లో ఉన్న నీటిలో మునిగి చనిపోయాడు.
బాబు కిందకు వెళ్లడాన్ని గమనించిన తండ్రి యుగేందర్... వెంటనే కిందకు వెళ్లే సరికి అప్పటికే బాలుడు నీటిలో మునిగిపోయి ఉన్నాడు. వెంటనే బాబును బయటకు తీసి ఆసుపత్రికి తీసుకువెళ్లగా... అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధరించారు. ఈ ప్రమాదంపై బాలుడి తండ్రి సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: రాగల రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు