ఖమ్మం జిల్లా వైరాలో చేపల వేటకు వెళ్లి గుగులోతు రవి అనే మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. శాంతినగర్ ఎస్టీ కాలనీకి చెందిన రవి ఆదివారం సాయంత్రం వైరా జలాశయంలో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి గల్లంతయ్యాడు.
చేపల వేటకు వెళ్లిన రవి రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆరా తీశారు. చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా ఇవాళ మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలాన్ని కొనిజర్ల ఎస్సై మొగిలి పరిశీలించి... కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి : ప్రతి ఒక్కరూ ఓ అభ్యర్థిలా పనిచేసినప్పుడే గెలుపు: మాణిక్కం