భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. గుండాల మండలం దేవళ్లగూడెం అటవీప్రాంతంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరగగా.. ఓ మావోయిస్టు మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపారు.
కొద్దికాలంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల సంచారం పెరిగింది. అప్పటినంచి గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అడవుల్లో గాలింపు జరుపుతుండగా సమయంలో మావోయిస్టులు ఎదురుపడినట్లు సమచారం. అప్పుడే ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.
అనంతరం దేవళ్లగూడెం ఎన్‌కౌంటర్ ప్రాంతాన్ని ఎస్పీ సునీల్ దత్ పరిశీలించారు. జిల్లాలో చాలాకాలంగా మావోయిస్టుల కదలికలపై సమాచారం ఉందని తెలిపారు. మావో బృందాలు సంచరిస్తున్నాయన్న సమాచారంతో నిఘా పెంచామని చెప్పారు. మావోయిస్టు బృందాలు తిరుగుతున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారమిచ్చామని అన్నారు. దుబ్బగూడెం, దేవుళ్లగూడెం, గంగారం ప్రాంతాల్లో మావోల సంచారిస్తున్నట్లు వివరించారు.
బుధవారం రాత్రి నుంచి వాహనాల తనిఖీలు చేపట్టామన్నారు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారని... తనిఖీలు చేసేందుకు ఇద్దరిని ఆపేందుకు యత్నించామని పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులు పోలీసులపై కాల్పులు జరిపారని చెప్పారు. అయితే అనంతరం కాల్పులు జరిగిన ప్రదేశాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తే... సుమారుగా 25 సంవత్సరాల మావోయిస్టు మృతదేహం, ఓ ఆయుధం, ఓ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ఇదీచూడండి.. టెక్నాలజీతో సామాన్యుల జీవితంలో మార్పులు తేవాలి: కేటీఆర్