నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని ఔషధ పరిశ్రమ గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. ఎరిన్ పరిశ్రమలో విద్యుదాఘాతం వల్ల మంటలు చెలరేగి... రెండు టన్నుల సామగ్రి ఆహుతైంది.
ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో గోదాం వద్ద 15 మంది కార్మికులున్నారు. తీవ్రతను గుర్తించి వెంటనే అక్కడి నుంచి బయటకు రావటంతో ప్రమాదం తప్పింది. ఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు.
ఇదీ చదవండి: చూస్తుండగానే దగ్ధమైన మారుతి వ్యాన్