కుమురం భీం ఆసిఫాబాద్‌లో అటవీ చెక్‌పోస్టు సమీపంలో గల శ్రీ భక్తమార్కండేయ ఆలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం అర్చకుడు దూప, దీప, నైవేద్య కార్యక్రమం ముగించుకుని ఇంటికి వెళ్లారు. అనంతరం దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయంలో చెలరేగుతున్న మంటలను గమనించారు.
భక్తుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆలయంలో దీపాల ద్వారా ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో దాదాపు రూ.30 వేల ఆస్తినష్టం జరిగినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి: రికార్డు ధర పలికిన పసుపు.. రైతుల హర్షం