యాదాద్రి భువనగిరిజిల్లా యాదగిరిగుట్టలో అగ్నిప్రమాదం జరిగింది. యాదాద్రి ఆలయ వసతి గృహ సముదాయం తులసీ కాటేజీ పక్కన చెత్త తగలపెడుతుండగా ప్రమాదవశాత్తు మంటలు సంభవించాయి. వసతి గృహ సముదాయం వద్ద ఉంచిన ఐరన్ పైపులకు మంటలు అంటుకోవడం వల్ల ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.
హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి, సకాలంలో మంటలు ఆర్పడం వల్ల పెను ప్రమాదం తప్పింది.
ఇదీ చూడండి: అర్ధరాత్రి అగ్ని ప్రమాదం... వృద్ధురాలు సజీవదహనం