నిజామాబాద్ జిల్లా రుద్రూర్ సీఐ కార్యాలయం ఎదుట రెండు వర్గాలు పరస్పరం దాడికి దిగాయి. రుద్రూర్లోని ఓ మజీద్ కమిటీ నూతనంగా ఏర్పాటైంది. ఇమామ్ను తొలగిస్తూ... నూతన కమిటీ నిర్ణయం తీసుకోవటం వివాదానికి కారణమైంది.
పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సమయంలో మాటామటా పెరిగి ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. పిడిగుద్దులతో ఇష్టమొచ్చినట్లు కొట్టుకుంటూ భీతావహ వాతావరణం సృష్టించారు. నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా ఇరువర్గాలు తగ్గకపోవటం వల్ల... చివరకు పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.