రంగారెడ్డి జిల్లా మన్నేగూడలోని జాతీయ కోరమండల్ లిమిటెడ్ క్రిమిసంహారక మందుల గోడౌన్లో గత కొద్ది రోజులుగా మందులు చోరీకి గురవుతున్నాయి. ఈ విషయమై కంపెనీ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు గోడౌన్లో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులే దొంగలుగా తేల్చారు.
నిందితులు నకిలీ తాళపు చెవిని తయారు చేయించి రెండు నెలలో వ్యవధిలో ఐదు సార్లు 98 కాటన్ల క్రిసంహారక మందు బాక్సులను దొంగిలించారు. వీరి పట్టుకున్న పోలీసులు.. రూ.1,07,92,000 విలువైన రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లు, 98 కాటన్ల క్రిమిసంహాక మందులు స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.
ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన బంగారం ధర