ETV Bharat / jagte-raho

విషాదం: తన ఇద్దరు పిల్లలను పొట్టన పెట్టుకున్న తండ్రి - తెలంగాణ నేర వార్తలు

ఏపీ అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లాలించి పెంచాల్సిన తండ్రి తన బిడ్డలను పొట్టన పెట్టుకున్నాడు. నిద్రలో ఉన్న తన కుమారులను తిరిగి రాని లోకాలకు పంపించాడు. కళ్యాణదుర్గం మండల పరిధిలో ఈ ఉదంతం జరిగింది.

father-killed-sons-at-kalyana-durgam-ananthapur
విషాదం: తన ఇద్దరు పిల్లలను పొట్టన పెట్టుకున్న తండ్రి
author img

By

Published : Oct 15, 2020, 4:04 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం బోయలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తన ఇద్దరు కుమారులను ఓ తండ్రి హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది.

విషాదం: తన ఇద్దరు పిల్లలను పొట్టన పెట్టుకున్న తండ్రి

రంగప్ప, రాధమ్మ అనే భార్యాభర్తలకి ఏడేళ్ల సుదీప్, సుధీర్​ ఉన్నారు. రాత్రి తల్లి పక్కన నిద్రించిన పిల్లల్లో ఒక్కొక్కరిని గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి రంగప్ప హత్య చేశాడు. మొదట సుదీప్​ను తీసుకెళ్లి హతమార్చి గుంతలో పూడ్చి పెట్టాడు. తర్వాత సుధీర్​ను చంపి పూడ్చి పెట్టాడు.

బిడ్డలు తన పక్కన లేకపోయేసరికి కంగారు పడిన తల్లి స్థానికుల సహాయంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికింది. రంగప్పపై అనుమానం వచ్చిన గ్రామస్థులు అతన్ని నిలదీశారు. చివరకు పిల్లలను హతమార్చి పూడ్చిపెట్టిన ప్రదేశానికి అందర్నీ అతను తీసుకెళ్లాడు. ఆ దుర్ఘటన చూసిన అంతా హతాశులయ్యారు.

విషయాన్ని గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ, సీఐ శివశంకర్ నాయకులు అటవీ ప్రాంతానికి వెళ్లి పూర్తి సమాచారం సేకరించారు. నిందితుడు రంగప్పను అదుపులోకి తీసుకున్నారు. అయితే అతనికి మతిస్థిమితం లేదని అందుకే ఈ దురాఘతానికి పాల్పడ్డాడని బంధువులు చెబుతున్నారు.

ముచ్చటగొలిపే మాటలతో అప్పటి వరకు అల్లరి చేసి పడుకున్న బిడ్డలు ఇద్దరూ ఇలా అచేతనంగా పడి ఉండటాన్ని చూసి కన్నతల్లి బోరున విలపించింది. ఆమెతో పాటు బంధువుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చదవండి: గూగుల్ మరో తప్పిదం.. ఈసారి సచిన్ కుమార్తెకు పెళ్లి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.