నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తండ్రీ కొడుకులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. దామరగిద్ద మండలం కేతన్‌పల్లికి చెందిన నాగప్ప, అతడి కుమారుడి పొలానికి సంబంధించి... పట్టా చేయడం లేదంటూ ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించారు. భూమికి సంబంధించి దస్తావేజులు ఉన్నప్పటికీ... అధికారులు ఏళ్ల తరబడి తిప్పించుకుంటున్నారని ఆరోపించారు.
అనంతరం ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. తండ్రికొడుకులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి భూ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: భూ వివాదం: కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్న ఇరువర్గాలు