నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రానికి చెందిన గురు(39) తనకొడకు శివ(5)కు గ్రామ సమీపంలో ఉన్న ఓ బావిలో ఈత నేర్పించడానికి నిన్న వెళ్లారు. సాయంత్రం అయినా తిరిగి ఇంటికి రాకపోవడం వల్ల కంగారు పడ్డ కుటుంబీకులు బావి దగ్గరకు వెళ్లి చూడగా మొదట కొడుకు శివ విగతజీవిగా మారి బావిలో తేలియాడుతుండడంతో కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు.
తండ్రి గురు ఆచూకీ తెలియకపోవడం వల్ల గ్రామస్థులు బావిలోకి దిగి వెతకడంతో చివరికి రాత్రి 11 గంటల ప్రాంతంలో గురు మృతదేహాన్ని వెలికితీశారు. ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి... తండ్రి కొడుకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.