జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సహకార సంఘం కార్యాలయంపై వెల్లుల్ల గ్రామానికి చెందిన రైతులు దాడి చేశారు. రబీలో వరిధాన్యం కొనుగోలు అవినీతి జరిగిదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.
ఫర్నీచర్ ధ్వంసంచేసిన రైతులు కార్యాలయానికి తాళంవేసి అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ప్రతి రైతు నుంచి పెద్దమొత్తంలో డబ్బులు తగ్గిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చదవండి: అమరుల త్యాగాలను నిరంతరం స్మరించుకుంటాం: సీపీ