మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని ఇసరం పల్లి గ్రామానికి చెందిన చిన్న మల్ల బాలరాజు(38) తనకున్న రెండు ఎకరాలతో పాటు మరో ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని.. పత్తి సాగు చేశాడు. భారీ వర్షాలకు పంట దెబ్బతింది. ఆశించిన దిగుబడి రాలేదని, సాగుకు చేసిన అప్పులు తీరే పరిస్థితి లేదని మనస్తాపం చెందాడు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడుతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు దేవరకద్ర ఎస్సై భగవంత రెడ్డి తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: చిన్నారిపై 'వేధింపులు'.. ఆటోడ్రైవర్‌ను చితక్కొట్టిన మహిళలు