భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పోలవరంలో విషాదం చోటుచేసుకుంది. అకాల వర్షాలకు పంట దెబ్బతినడం వల్ల మనస్తాపానికి గురై దారావత్ రాందాస్ అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గ్రామానికి చెందిన దారావత్ రాందాస్ తనకున్న 9 ఎకరాల పొలంలో 6 ఎకరాల్లో మొక్కజొన్న, 3 ఎకరాల్లో వరి పంట సాగు చేశాడు. చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలతో పంటంతా నేలకొరిగింది. దెబ్బతిన్న పంటలను చూసి మనస్తాపం చెందిన రాందాస్.. ఇంటికి వెళ్లొస్తానని చెప్పి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
గుర్తించిన కుటుంబ సభ్యులు రాందాస్‌ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇదీ చూడండి.. మానసిక ఒత్తిడితో బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య