ఇంటర్ చదివి వైద్యునిగా చెలామణి అవుతున్న పొల్కంపల్లి సాయికుమార్‌ను మీర్పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో సాయిక్లీనిక్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఎంసెట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్న సాయికుమార్ సంతోశ్‌నగర్‌లోని శ్రీనివాస ఆస్పత్రిలో ఆరేళ్ల పాటు ఆపరేషన్ థియేటర్లో సహాయకుడిగా పనిచేసినట్లు తెలిపారు. అతని వద్దనుంచి ఒక స్టెతస్కోప్, బీపీ పరికరం, రబ్బర్ స్టాంప్, బోర్డుతోపాటు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.