ETV Bharat / jagte-raho

ఏన్కూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం - Khammam district news

ఖమ్మం జిల్లా ఏన్కూరులో పేలుడు పదార్థాల్లో ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్​ను పోలీసులు పట్టుకున్నారు. భువనగిరి నుంచి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్​ఫోర్స్ సీఐ వెంకటస్వామి తెలిపారు.

explosives caught at enkuru in khammam district
ఏన్కూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
author img

By

Published : Nov 13, 2020, 10:54 AM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరులో పేలుడు పదార్థాల్లో ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్​ను టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు రూ.2 లక్షలు విలువ చేసే పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్​ఫోర్స్ సీఐ వెంకటస్వామి తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు తరలిస్తున్నాడనే సమాచారంంతో ఏన్కూరులో తనిఖీ చేపట్టినట్లు సీఐ వెల్లడించారు. ఈ తనిఖీల్లో డీసీఎంలో తరలిస్తున్నపేలుడు పదార్థాలు లభ్యమైనట్లు చెప్పారు. వ్యాన్​తో పాటు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.