ETV Bharat / jagte-raho

ఉద్యోగి ప్రాణం తీసిన సగం జీతం - కేపీహెచ్​బీ కాలనీలో ఉద్యోగి ఆత్మహత్య

పూర్తి జీతం చేతికందినా నెల గడవని మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో. అప్పో సొప్పో చేసి సంసారాన్ని నెట్టుకొస్తున్న వీరిపై లాక్​డౌన్​ పిడుగులా పడింది. ఉద్యోగ సంస్థలు ఇచ్చే అరకొర జీతాలు మధ్యతరగతి వారిని పూర్తిగా చీకట్లోకి నెట్టేశాయి. చేసేదేం లేక చావే శరణ్యమనుకుంటున్న వారేందరో? కుటుంబ పోషణ భారమైందనే మనస్తాపంతో హైటెన్షన్ విద్యుత్​ స్తంభానికి ఉరేసుకున్నాడు కేపీహెచ్​పీ కాలనీకి చెందిన ఓ ఉద్యోగి.

ఉద్యోగి ప్రాణం తీసిన సగం జీతం
ఉద్యోగి ప్రాణం తీసిన సగం జీతం
author img

By

Published : May 29, 2020, 8:20 PM IST

ఆర్థిక ఇబ్బందులకు తోడు లాక్​డౌన్ కారణంగా కంపెనీ నుంచి జీతం సరిగ్గా అందకపోవడం ఓ ఉద్యోగి మృతికి కారణమైంది. తమిళనాడు తిరుత్తనికి చెందిన లక్ష్మీనారాయణ శివకుమార్ నిజాంపేట్ రోడ్డులోని భవ్యాస్ ఆనందం అపార్ట్‌మెంట్స్​లో కుటుంబంతో నివాసముంటున్నాడు. ఎర్రమంజిల్​లోని నెక్సస్ కంపెనీలో అడ్మిన్​గా పనిచేస్తున్నాడు. లాక్​డౌన్​ కారణంగా పూర్తి జీతం అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

కుటుంబ పోషణ విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన శివకుమార్..​ ఇవాళ తెల్లవారుజామున ఇంట్లో చెప్పకుండా వెళ్లి శివాలయం వెనుకనున్న హైటెన్షన్ విద్యుత్​ స్తంభానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శివకుమార్ కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి: కాళేశ్వరం అద్వితీయం... కొండపోచమ్మకు గోదావరి పరుగులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.