ETV Bharat / jagte-raho

దొంగలతో పోలీసుల డీల్​... దోచుకున్న సొమ్ములో వాటా - polices shares stolen money in emmiganur

ఏపీలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కొందరు పోలీసులు సరికొత్త అవతారమెత్తారు. డబ్బుల కోసం దొంగలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. చోరీలకు పాల్పడి దోచుకున్న సొమ్ములో వాటాలు తీసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. ఈ అవినీతి తతంగం ఉన్నతాధికారుల విచారణలో బయటపడటంతో జిల్లాలో చర్చనీయాంశమైంది.

police theft case
police theft case
author img

By

Published : Nov 24, 2020, 5:14 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దొంగలు చేసిన చోరీలో పోలీసులు భాగమయ్యారు. దోచుకున్న సొమ్ములో వాటా తీసుకుంటున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి రాగా.. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశమైంది. ఇటీవల దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే కొత్తగా వచ్చిన శిక్షణ ఐపీఎస్ ప్రతాప్‌ శివకిషోర్‌.... దొంగలకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో తెలుసుకునేందుకు... వారి ఫోన్‌ డేటాను తనిఖీ చేశారు.

ఈ డేటాలో విస్తుపోయే అంశాలు బయటపడినట్లు తెలుస్తోంది. దొంగలు చోరీలకు పాల్పడి... దోచుకున్న సొమ్ములో పోలీసులు వాటా తీసుకుంటున్నట్లు విచారణలో తేలింది. ఫలితంగా ఒక ఎఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.