కూకట్‌పల్లి మూసాపేట్ సర్దార్‌నగర్‌లో దుర్గామాత ఆలయంలోని విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. గుడిలోని విగ్రహాన్ని పూర్తిగా తొలగించారు. సమీపంలోని జంట నాగుల విగ్రహాన్నీ ముక్కలు చేశారు. ఆపై ఓ శునకాన్ని చంపి.. ఆలయ ఆవరణలో వేలాడదీశారు.
విషయం తెలుసుకున్న మూసాపేట్ భాజపా కార్పొరేటర్ మహేందర్ ఆలయం ఎదుట బైఠాయించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
![God statue demolished at sardar nagar in musapet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10371344_nl2.jpg)
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆలయంలో విగ్రహాల ఏర్పాటు, ఆలయ అభివృద్ధికి గానూ తాను రూ. 5 లక్షల విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: శూలంతో పొడిచి.. డంబెల్‌తో కొట్టి.. కన్నకూతుళ్లనే చంపేశారు!