ఏపీ విశాఖలోని సముద్రంలో ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేటకు వెళ్లిన మత్స్యకారుల మధ్య రింగువలల వివాదం తలెత్తింది. 13 బోట్లలో రింగువలలతో వాసవానిపాలెం మత్స్యకారులు వెళ్లారు. సమాచారం అందుకున్న పెద్దజాలరిపేట జాలర్లు 100 బోట్లలో వెళ్లి.. వాసవానిపాలెం జాలర్లను చుట్టుముట్టారు.
పెద్దజాలరిపేట జాలర్లు అడ్డుకోవడంతో వాసవానిపాలెం జాలర్లు వెనుదిరిగారు. వాసవానిపాలెం, పెద్దజాలరిపేట గ్రామాల్లో పోలీసుల మోహరించారు. ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. రింగు వలలతో చేపల ఉత్పత్తి తగ్గుతుందని కొందరు మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ జాలర్ల వివాదంపై మత్స్య శాఖ ప్రకటన విడుదల చేసింది. రింగువలల సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు రింగువలలతో వేటను మత్స్యశాఖ నిషేధించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే బోటు లైసెన్స్, రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించింది.
ఇదీ చదవండి: నమ్మినవారే నట్టేట ముంచారని మనస్తాపంతో ఆత్మహత్య