ETV Bharat / jagte-raho

కొల్లాపూర్​లో పెళ్లి వ్యాను బోల్తా... 16 మందికి గాయాలు - నాగర్​కర్నూల్​ జిల్లాలో పెళ్లి వ్యాను బోల్తా

నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ మండలం రామాపురం సమీపంలో పెళ్లి వ్యాను బోల్తాపడింది. ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కొల్లాపూర్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కొల్లాపూర్​లో పెళ్లి వ్యాను బోల్తా... 16 మందికి గాయాలు

author img

By

Published : Oct 29, 2020, 8:43 AM IST

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో డీసీఎం వ్యాను బోల్తాపడింది. కొల్లాపూర్‌ మండలం రామాపురం వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న వాహనం బోల్తా పడిన ఘటనలో 16 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినపుడు డీసీఎం వాహనంలో 65 మంది ఉన్నట్టు సమాచారం. వేగంగా వెళ్తున్న వాహనం... రామాపురం సమీపంలో మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. రోడ్డుపై వర్షపు నీరు చేరడం వల్లనే ప్రమాదం జరిగిందని డీసీఎం డ్రైవర్ తెలిపాడు.

క్షతగాత్రులను కొల్లాపూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందరూ స్వల్ప గాయాలతోనే బయటపడటం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో పెళ్లి కుమారుడు రాజు సురక్షితంగా బయటపడ్డాడు. గురువారం ఉదయం కొల్లాపూర్‌ మండలం ఎల్లూరులో రాజు వివాహం జరగనున్న నేపథ్యంలో ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులంతా గద్వాల మండలం జమ్మిచెడుకు చెందినవారిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న మార్కెట్ కమిటీ ఛైర్మన్ గున్​రెడ్డి నరేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులకో కలిసి ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.

ఇదీ చూడండి: సురేందర్​ బ్యాంకు లాకర్​లో భారీగా నగదు, బంగారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.