హైదరాబాద్కు చెందిన పోకర్ణ గ్రానైట్ అనే సంస్థ సౌత్ అమెరికాకు చెందిన కంపెనీతో ఆన్‌లైన్ వ్యాపారం చేస్తోంది. యూఎస్ కంపెనీ పేరుతో నకిలీ ఈమెయిల్ ఖాతా తెరిచిన నిందితులు.. ఆర్డర్ చేసిన మెటీరియల్ పంపించామంటూ పోకర్ణ గ్రానైట్ కంపెనీకి ఈమెయిల్ చేశారు. మెటీరియల్ పంపినందుకు 59 వేల యూరోలు (రూ.52 లక్షలు) పంపించాలని కోరారు.
ఇది నమ్మిన పోకర్ణ గ్రానైట్ కంపెనీ ప్రతినిధులు ఎప్పటిలాగానే ఈమెయిల్‌లో ఉన్న అకౌంట్‌లోకి రూ.52 లక్షలు బదిలీ చేశారు. చాలా రోజుల వరకు మెటీరియల్ రాకపోవడం వల్ల నకిలీ ఈమెయిల్‌గా గుర్తించిన కంపెనీ ప్రతినిధి గౌతమ్ జైన్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: తెలంగాణలో కొత్తగా 1,811 కరోనా కేసులు.. 9 మంది మృతి