రాజేంద్రనగర్ దంతవైద్యుడు హుసేన్ కిడ్నాప్ కేసులో సైబరాబాద్ పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు సీపీ సజ్జనార్ తెలిపారు. హుస్సేన్ భార్యకు దగ్గరి బంధువు ముస్తఫా... ఆస్ట్రేలియాలో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఈ క్రమంలో ముబాషిర్ అహ్మద్‌తో కలిసి... హైదరాబాద్, పుణెలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు. ఇద్దరు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. డబ్బు కోసం ఎవరైనా ధనవంతుడిని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకొని... దంత వైద్యుడు హుస్సేన్‌ను ఎంచుకున్నారు.
ఈ క్రమంలో డాక్టర్ హుస్సేన్‌తో పరిచయం పెంచుకున్నారు. కొత్తగా నిర్మించిన భవనంలో డాక్టర్ హుస్సేన్ క్లినిక్‌ను ప్రారంభించాడు. ఇదే భవనంలో మొదటి అంతస్తులో ముస్తఫా ఫ్లాట్ అద్దెకు తీసుకొని నిఘా పెట్టారు. ప్లాన్‌లో భాగంగా నిన్న మధ్యాహ్నం లైటర్ తుపాకీతో బెదిరించి డాక్టర్ కారులోనే కిడ్నాప్ చేసి... కర్ణాటకకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.
క్లినిక్ నుంచి హుస్సేన్‌ను కూకట్‌పల్లికి తరలించని నిందితులు... హుస్సేన్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి 48 గంటల్లోపు రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు... 12 బృందాలుగా ఏర్పడి 12 గంటల్లో కేసు ఛేదించినట్టు సీపీ వివరించారు. బెంగళూరుకు తరలిస్తుండగా... నిందితులను పట్టుకునేందుకు అనంతపురం పోలీసులు సహకరించినట్టు సజ్జనార్ వెల్లడించారు.
ఇదీ చూడండి: ఈత నేర్చుకునేందుకు వెళ్లి చెరువులో యువకుడు గల్లంతు