ETV Bharat / jagte-raho

సైబర్ మోసం: బ్యాంకు ఖాతా నుంచి రూ4.10 లక్షలు మాయం

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. వారిని పట్టుకోవడానికి పోలీసులు వినూత్న పద్ధతుల్లో ప్రయత్నాలు సాగిస్తుంటే.. సైబర్ నేరగాళ్లు వారి కంటే మరో అడుగు ముందే ఉంటున్నారు. చేతికి చిక్కినట్టే చిక్కి.. మాయమవుతున్నారు.

author img

By

Published : Nov 22, 2020, 9:12 AM IST

cyber criminals theft money from others bank account
బ్యాంకు ఖాతా నుంచి రూ4.10 లక్షలు మాయం

హైదరాబాద్ టోలీచౌకికి చెందిన గులాబ్ దస్తగిరి అనే వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రమేయం లేకుండానే ఖాతాలో ఉన్న డబ్బు మాయమైనట్లు ఫిర్యాదు చేశాడు. రూ.4.10లక్షలు తన బ్యాంకు ఖాతానుంచి పోయాయని ఆందోళన వ్యక్తం చేశాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాకు సంబంధించిన సమాచారం ఎవరికీ చెప్పకూడదని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.