సైబర్ నేరగళ్ల ఉచ్చులో పడుతున్న అమాయక ప్రజలు వివిధ కారణాలతో ఆర్థిక దోపిడీలకు గురవుతున్నారు. నగరంలోని పలువురు బాధితులను నమ్మిస్తూ సైబర్ క్రిమినల్స్ సుమారు రూ. 8 లక్షలను దండుకున్నారు.
జియో మార్ట్ పేరిట..
జియో మార్ట్ పేరుతో ఓ బాధిత వ్యక్తి వద్ద లక్ష రూపాయలను మోసం చేశారు. ఒఎల్ఎక్స్ పేరుతో 2 లక్షలు.. ఓటీపీ, కేవైసీ పేరుతో 10 మంది నుంచి 5 లక్షల రూపాయలను సైబర్ దొంగలు కాజేశారు.
దిల్లీలో డబ్బులు డ్రా..
ఓ వ్యక్తి డెబిట్ కార్డ్ క్లోనింగ్ ద్వారా సైబర్ నేరగాళ్లు దిల్లీలో డబ్బులు డ్రా చేసుకుని మోసం చేశారు. వీటితో పాటు ఆన్లైన్ డేటింగ్ పేరుతో ఓ మహిళను ఆగంతుకుడు వేధించాడు. బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేయగా... కేసులు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి : 'జూబ్లీహిల్స్ పీఎస్ పరిధి హత్య కేసులో నిందితుడు షమర్ బేగ్ అరెస్ట్'