ETV Bharat / jagte-raho

ప్రముఖుల వాట్సాప్​ హ్యాక్​!.. పోలీసులు ఏం చెప్పారంటే..

author img

By

Published : Sep 29, 2020, 6:55 PM IST

ప్రముఖుల వాట్సాప్​ హ్యాక్​ అవుతున్నట్లు తమకెలాంటి ఫిర్యాదులు అందలేదని సైబర్​ క్రైం పోలీసులు వివరించారు. వాట్సాప్​కు సంబంధించిన ఆరు అంకెల ఓటీపీని ఎవ్వరికీ చెప్పనంత వరకు వినియోగదారులు సురక్షితంగా వాట్సాప్​ను ఉపయోగించుకోవచ్చని సైబర్​ క్రైం పోలీసులు చెబుతున్నారు.

cyber crime police on celebrities whatsapp hack news
ప్రముఖుల వాట్సాప్​ హ్యాక్​!.. పోలీసులు ఏం చెప్పారంటే..

కొంతమంది ప్రముఖుల వాట్సాప్​ ఖాతాలను హ్యాక్​ చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీని గురించి తెలుసుకునేందుకు సైబర్​ క్రైం పోలీసులను సంప్రదించగా బ్యాంకింగ్​ మోసాలు జరిగినట్లుగానే ఏమరపాటుగా ఉండి.. ఓటీపీ చెప్తే వాట్సాప్​ను హ్యాక్​ చేసే అవకాశముందని పోలీసులు తెలిపారు. సైబర్​ క్రైం పోలీసులు తరచుగా చెబుతున్నట్లు వాట్సాప్​ ఖాతాకు సంబంధించిన ఓటీపీని ఎవ్వరికీ చెప్పవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

వాట్సాప్​ వినియోగదారులు ప్లేస్టోర్​లోకి వెళ్లి వాట్సాప్​ను డౌన్​లోడ్​ చేసుకున్న తర్వాత దానిని ఇన్​స్టాల్​ చేసుకునే సమయంలో ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పకుండా, లింక్​ను తెరవనంత వరకు సైబర్​ నేరగాళ్లు వినియోగదారుని వాట్సాప్​ను హ్యాక్​చేసే అవకాశమే లేదని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: ఆ ఛాలెంజ్​లకు దూరంగా ఉండండి : సైబరాబాద్​ పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.