ETV Bharat / jagte-raho

లాటరీలో కారు వచ్చిందన్నారు.. రూ.11లక్షలు కాజేశారు - cyber crimes in guntur

లాటరీలో కారు గెలుచుకున్నారని ఓ మహిళకు ఫోన్ చేశారు సైబర్ కేటుగాళ్లు. కారు పంపించాలంటే తమ ఖాతాలో రూ.11 లక్షల వేయాలని మాయమాటలు చెప్పి.. నగదు జమ చేయించుకున్నారు. చివరకు తాను మోసపోయానని గ్రహించిన బాధిత మహిళ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

లాటరీలో కారు వచ్చిందన్నారు.. రూ.11లక్షలు కాజేశారు

author img

By

Published : Oct 20, 2020, 5:43 PM IST

'నమస్తే మేడం మీరు లాటరీలో కారు గెలుచుకున్నారు. అది మీకు పంపించాలంటే రూ. 11 లక్షలు మా అకౌంట్​లో వేస్తే వారంలో మీ ఇంటికి ఖరీదైన కారు వస్తుంది'. ఇలా సైబర్ నేరగాళ్లు మాయమాటలు చెప్పి ఓ మహిళా వద్ద నుంచి రూ.11 లక్షల నగదును కాజేసిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని గుంటూరు సౌత్ డీఎస్పీ కమలాకర్ రావు తెలిపారు. సైబర్ క్రైమ్​లో మరో ఇద్దరి పాత్ర ఉందని... వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు.

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడు గ్రామానికి చేందిన వణుకురి విజయలక్ష్మి అనే మహిళకు... గత నెల 7న తాము నాప్టాల్ నుంచి ఫోన్ చేస్తున్నాం.. మీకు కారు గిఫ్ట్​గా వచ్చింది. అయితే కొవిడ్ కారణంగా కారు పంపించలేము.. దానికి బదులుగా రూ. 35 లక్షల నగదును మీకు పంపిస్తాం... దాని కోసం మీరు 4% డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని పశ్చిమ బెంగాల్​కి చెందిన సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఇలా పలుమార్లు ఫోన్ చేసి బాధితురాలు ఇంటికి కంపెనీకి సంబంధించిన లేఖ పంపించారు. నిజమే అని నమ్మిన బాధితురాలు వారు చెప్పిన అకౌంట్ నంబర్లకు రూ.11,30,300 నగదును జమ చేసింది.

నగదు ఖాతాలో వేసి 10 రోజులు గడిచినా వారికి రూ.35 లక్షలు రాలేదు. మోసపోయానని గమనించిన బాధితురాలు వట్టిచెరుకూరు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు అకౌంట్ నెంబర్ సాయంతో ఇద్దరు నిందితులను పశ్చిమబెంగాల్​లోని షమిల్పూర్​లో అరెస్టు చేసినట్లు చెప్పారు. కేసులో కీలకమైన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని... వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి నగదును రికవరీ చేస్తామన్నారు డీఎస్పీ కమలాకర్.

ఇదీ చదవండి: నమ్మకంగా పనిచేస్తారు.. మత్తుమందిచ్చి ఇలంతా దోచేస్తారు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.