ETV Bharat / jagte-raho

ఆదమరిస్తే అంతే సంగతి.. సైబర్ నేరగాళ్ల ట్రాప్​లో పడొద్దు - telangana news

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఉద్యోగం అని.. కస్టమర్​ కేర్​ అని.. లాటరీ అని.. ఇలా రకరకాలుగా ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. అమాయక ప్రజలు సులభంగా వారి కుయుక్తులకు చిక్కుకుని నగదును సమర్పించుకుంటున్నారు.

cyber cheating cases at hyderabad
ఆదమరిస్తే అంతే సంగతి.. సైబర్ నేరగాళ్ల ట్రాప్​లో పడొద్దు
author img

By

Published : Dec 18, 2020, 10:02 PM IST

సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోతూ.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించేవారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఉద్యోగం ఇస్తామని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.2.10 లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. మెట్టుగూడకు చెందిన తిమోతి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. తన వివరాలను నౌకరి డాట్​ కామ్​లో ఆప్లోడ్ చేశారు. రెండురోజుల క్రితం ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తాము అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ ప్రతినిధినంటూ పరిచయం చేసుకున్నాడు. మీ అర్హతకు తగిన ఉద్యోగం ఉందని చెప్పి.. ఇంటర్వూ, ప్రాసెసింగ్ రుసుం ఇలా రకరకాల కారణాలతో రూ.2.10 లక్షలు తన ఖాతాలో జమ చేయించుకున్నాడు. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.

మరో కేసులో యూసుఫ్ గూడకు చెందిన అబ్దుల్​ సయ్యద్ బ్యాంక్​కు వెళ్లి తన ఖాతాకు సంబంధించిన స్టేట్​మెంట్ తీసుకున్నారు. దాన్ని పరిశీలించి ఒక్కసారిగా అవాక్కయ్యారు. తన ఖాతాలోంచి 90 వేలు విత్​డ్రా అయినట్లుగా గుర్తించి బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఎస్సార్ నగర్​కు చెందిన రామస్వామి పేటీఎం ద్వారా తన భార్యకు 500 పంపించారు. ఫెయిల్ అని రాగా... గూగుల్​లో కస్టమర్​ కేర్​ నంబర్​ వెతికి ఫోన్​ చేశాడు. వెంటనే మీ డబ్బులు ఖాతాలో తిరిగి జమ చేస్తామని నమ్మించి.. పేటీఎం నెంబర్, పిన్ నెంబర్లు తెలుసుకొని రామస్వామి ఖాతాలోంచి కేటుగాళ్లు 65 వేలు కాజేశారు. బాధితులందరూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: ఆదిలాబాద్‌ తాటిగూడ కాలనీలో కాల్పుల కలకలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.