ETV Bharat / jagte-raho

కిడ్నాప్​ చేసి రూ.కోట్లు దోచుకునేందుకు నేరస్థుల ప్రణాళిక - హైదరాబాద్​ తాజా వార్తలు

సులభంగా డబ్బు సంపాదించేందుకు నేరస్థులు గత కొంతకాలంగా అపహరణల మార్గాన్ని ఎంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని తమ ప్రణాళిక అమలుచేస్తున్నారు. బాధితుల్లో కొందరు కిడ్నాపర్లు డిమాండ్‌ చేసిన డబ్బును ఇస్తుండగా.. మరికొందరు ధైర్యంగా పోలీసులకు సమాచారం ఇస్తున్నారు.

criminals kidnap plan for crores of rupees
కిడ్నాప్​ చేసి రూ.కోట్లు దోచుకునేందుకు నేరస్థుల ప్రణాళిక
author img

By

Published : Oct 27, 2020, 4:42 PM IST

హైదరాబాద్​లో తాజాగా శామీర్‌పేటలో అయిదేళ్ల బాలుడి అదృశ్య ఘటన సోమవారం విషాదాంతమైంది. ఇంట్లో అద్దెకు ఉంటే బాలుడే ఆ చిన్నారిని హత్యచేసి మృతదేహాన్ని బాహ్యవలయ రహదారి దగ్గర్లో పడేయడం కలకలం రేపింది.

నాలుగేళ్ల క్రితం.. షాహినాయత్‌ గంజ్‌ ఠాణా పరిధిలో తల్లిదండ్రులతో నివాసముటుంటున్న పదోతరగతి విద్యార్థి అభయ్‌ మొదానిని నాలుగేళ్ల క్రితం అతడి ఇంట్లో పనిచేసే ముగ్గురు యువకులు శేషుకుమార్‌, రవి, మోహన్‌లు అపహరించారు. రూ.10 కోట్లు ఇస్తే వదిలేస్తామంటూ ఫోన్‌ చేశారు. రూ.5 కోట్లు ఇస్తానంటూ అభయ్‌ తండ్రి చెప్పాడు. బాలుడిని అట్టపెట్టెలో దాచి నోటికి, ముక్కుకు ప్లాస్టర్లు అతికించారు. శ్వాస అందక అభయ్‌ చనిపోవడంతో మృతదేహాన్ని ఓ ట్రాలీలో తీసుకెళ్లి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో రోడ్డుపై వదిలేశారు. పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనను ఇప్పటికీ నగరవాసులు మరిచిపోలేరు.

2019 జులై 30: సెకెండ్‌ హ్యాండ్‌ కార్ల క్రయవిక్రయాలు నిర్వహిస్తున్న గజేందర్‌ పారేఖ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఏవీ కళాశాల సమీపంలోని ఆయన దుకాణం వద్ద అపహరించారు. రూ.కోటి ఇస్తే వదిలేస్తామంటూ ఫోన్లు చేశారు. వారి కుటుంబ సభ్యులు రూ.30లక్షలు ఇస్తామని చెప్పారు. ఆ డబ్బు తీసుకుని గజేందర్‌ను వదిలేశారు. పోలీసులు ముగ్గురు నేరస్థులను అరెస్ట్‌ చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 2: జూబ్లీహిల్స్‌లో ఉంటున్న చేపల వ్యాపారి రమేష్‌(55)ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. కుటుంబ సభ్యులు ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్‌ ఫోన్‌ చేసి రూ.90 లక్షలు ఇస్తే రమేష్‌ను వదిలేస్తామంటూ హెచ్చరించారు. బోరబండలోని ఓ ఇంట్లో రమేష్‌ను హత్య చేసి గోనెసంచిలో మృతదేహాన్ని ఉంచి కిడ్నాపర్లు పారిపోయారు. అనంతరం పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి: దోమ పోటు సోకిందని వరి పంటకు నిప్పు పెట్టిన రైతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.