ETV Bharat / jagte-raho

హైదరాబాద్​లో నేరాలు తగ్గాయి.. - murder cases in hyderabad

హైదరాబాద్ మహానగరంలో పలు రకాల నేరాలు తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది తక్కువ సంఖ్యలో నేర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో సీసీ కెమెరాల ఏర్పాటు కీలకంగా మారింది. ప్రస్తుతం నగరంలో 3 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సంఖ్యను 5 లక్షలకు పెంచాలని ఉన్నతాధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. త్వరలోనే వీటిని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.

crime cases decreases in Hyderabad city
crime cases decreases in Hyderabad city
author img

By

Published : Oct 7, 2020, 1:01 PM IST

జంటనగరాల్లో నేరాలు రోజురోజుకు తగ్గుతున్నాయి. పెరుగుతున్న సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసుల గస్తీ, ఘటన జరిగిన తర్వాత వేగంగా ఆయా ప్రాంతాలకు చేరుకోవడం వంటి చర్యలే ఇందుకు కారణమని ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరిన్ని పటిష్ఠ చర్యలు తీసుకుని నేరాల కట్టడికి అన్ని రకాలుగా కృషి చేయాలని ఉన్నతాధికారులు... సిబ్బందికి సూచిస్తున్నారు. 2018, 19తో పోలిస్తే 2020లో ఇప్పటి వరకు నేరాలు తగ్గినట్టు గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.

గణాంకాలు ఇలా ఉన్నాయి..

2018లో 80 హత్యలు జరిగాయి. 2019లో 84 హత్యలు జరగ్గా... 2020లో ఇప్పటి వరకు 43 జరిగాయి. 2018లో అల్లర్లు 30, 19లో 34, 2020 లో ఇప్పటి వరకు 14... 2018లో అపహరణలు 402, 19లో 522, 2020 లో 309.... అత్యాచారాలు 2018లో 274, 19లో 301, 2020లో 216, మోసాల కేసులు 18లో 1650, 19లో 1746, 2020లో ఇప్పటి వరకు 831 జరిగాయి. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు 2018లో 2130, 19లో 2611, 2020లో 1322 నమోదయ్యాయి. మాదకద్రవ్యాల కేసులు 2018 లో 55, 19లో 98, 2020లో ఇప్పటి వరకు 58 నమోదయ్యాయి.

కేసులు

2018

2019

2019

హత్యలు

80 8443

అత్యాచారాలు

274 301 216

అల్లర్లు

303414

అపహరణలు

402522309

మోసాలు

16501746831

మహిళపై వేధింపులు

2130 2611 1322

మాదకద్రవ్యాలు

559858

ఐపీఎల్​ క్రికెట్​ బెట్టింగులు....

మరో వైపు ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు కొనసాగుతున్న నేపథ్యంలో కొందరు బెట్టింగ్‌ నిర్వాహకుల వలలో చిక్కుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఎక్కువగా యువత ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పట్ల ఆసక్తి చూపుతున్నారని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి పెట్టాలని సూచించారు. బెట్టింగ్‌ నిర్వహంచే వారి గురించి తెలిసిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.

నిఘానేత్రాలే కీలకం...

హైదరాబాద్‌ను నేరరహిత నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా మరిన్ని పటిష్టమైన చర్యలు చేపడతున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నగరంలో 3 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా.... మరో 2 లక్షల కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: ఉద్యోగాల పేరుతో టోకరా... రాజకీయ నేత కుమారుడి ప్రమేయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.