ETV Bharat / jagte-raho

పులి దాడిలో మరణించిన ఆవు కళేబరం గుర్తింపు - హాజీపూర్​లో సంచరిస్తున్న పులి

మంచిర్యాల జిల్లా హాజీపూర్​ మండలంలో బుగ్గగట్టు అటవీప్రాంతంలో ఓ ఆవు మరణించగా.. అది పులి దాడిలో మరణించినట్లు యజమాని గుర్తించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారమివ్వగా గ్రామంలో పులి సంచరిస్తున్నట్లు ధ్రువీకరించారు. వారం రోజుల పరిధిలో పశువులపై మూడో సారి దాడి జరగగా గ్రామస్థులు భయపడుతున్నారు.

cow died in tiger attack at mancherial district
పులి దాడిలో మరణించిన ఆవు కళేబరం గుర్తింపు
author img

By

Published : Sep 8, 2020, 9:45 PM IST

మంచిర్యాల జిల్లా హాజీపూర్​ మండలంలో మరోసారి పులి సంచారం కలకలం రేపింది. హాజీపూర్​ మండలంలోని బుగ్గగట్టు అటవీప్రాంతంలో రెండురోజుల క్రితం మేతకు వెళ్లిన పశువుల మందలో ఓ ఆవు తప్పిపోయింది. పశువుల కాపరి, యజమాని దానికోసం వెతగ్గా.. అటవీ ప్రాంతంలో పులి దాడిలో మరణించినట్లు గుర్తించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారమందించగా ఘటనాస్థలానికి చేరుకుని అస్తికలతో ఉన్న ఆవు కళేబరాన్ని పరిశీలించి పులి సంచరిస్తున్నట్లు ధ్రువీకరించారు.

cow died in tiger attack at mancherial district
పులి దాడిలో మరణించిన ఆవు కళేబరం గుర్తింపు

హాజీపూర్​ మండలంలో పులి.. పశువులపై దాడి చేయడం ఇది మూడోసారని స్థానికులు తెలిపారు. పులి సంచారంతో హాజీపూర్​ మండలంలోని సమీప గ్రామప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పులిపై గ్రామస్థులకు చైతన్యపరచడం లేదని.. ఈ విషయంలో అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని.. గ్రామపెద్దలు ఆరోపించారు.

ఇదీ చూడండి: పీవీకి భారతరత్న ఇవ్వాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.