హైదరాబాద్ చిలకలగూడ పీఎస్ పరిధిలోని అంబర్‌నగర్‌లో నివాసముంటున్న దంపతులు వెంకటేశ్, భార్గవి... ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి.. భార్యాభర్తలు చనిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
దంపతులు ఇద్దరు ఒకే పోస్టు ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వారి మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. బుధవారం తన కూతురు ఫోన్ చేసిందని.. తనను క్షమించాలని కోరిందని.. భార్గవి తండ్రి తెలిపారు. మరణ వార్త తెలుసుకున్న వాళ్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇదీ చూడండి: వర్షాకాల సమావేశాలపై కేసీఆర్ సమీక్ష